తమిళ సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ దర్శకుల్లో శంకర్ అలాగే మురుగదాస్ అంటే తెలీని వారు ఉండరు. శంకర్ స్టార్ట్ చేసిన కమర్షియల్ సోషల్ డ్రామా స్టైల్ కి మరో వెర్షన్ లా మురుగదాస్ కూడా పలు కమర్షియల్ సినిమాలు చేసి పాన్ ఇండియా లెవెల్లో ఇద్దరూ మంచి ముద్ర వేసిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఈ ఇద్దరూ ఇప్పుడు పూర్తి ఫామ్ లో లేరు. కానీ వీరి బ్రాండ్ పట్ల నమ్మకం మాత్రం చాలా మందిలో ఉంది. ఇక ఇదిలా ఉండగా ఓ క్రేజీ బజ్ ఇపుడు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి కాంబినేషన్ లలో నిర్మాతలుగా ఏదన్నా సినిమా అనుకుంటే పొరపాటే..
మురుగదాస్ ఇచ్చిన కథతో శంకర్ దర్శకత్వం వహించనున్నట్టు క్రేజీ రూమర్స్ ఇప్పుడు మొదలయ్యాయి. ఇక ఇందులో ఎంతమేరకు నిజం ఉందో కానీ ఈ టాక్ మాత్రం మూవీ లవర్స్ ని ఎగ్జైట్ చేస్తుంది. సో వీరి కాంబినేషన్ నిజంగా ఉందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.
