తారక్ నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ పై క్రేజీ బజ్.!

Published on Aug 13, 2021 3:15 pm IST


ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ కం పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. అలాగే ఈ చిత్రం అనంతరం తారక్ పలు భారీ చిత్రాల లైనప్ ని కూడా సిద్ధం చేసుకున్నాడు. మరి వాటితో “RRR” షూట్ కంప్లీట్ అయ్యిన వెంటనే తన హిట్ దర్శకుడు కొరటాల శివతో భారీ చిత్రాన్ని చేయనున్న సంగతి తెలిసిందే. దీనిని కూడా పాన్ ఇండియన్ లెవెల్లోనే ప్లాన్ చేస్తుండగా దీనిపై క్రేజీ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది.

అయితే కొన్నాళ్ల నుంచి ఈ చిత్రానికి సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఫిక్స్ అయ్యాడని టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే.. మరి అది ఇప్పుడు నిజమే అన్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా దీనిపై త్వరలోనే అధికారిక అప్డేట్ కూడా రానున్నట్టుగా సమాచారం.. ఈ మాస్ కాంబో కోసం తారక్ అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. లాస్ట్ టైం అరవింద సమేత కు మిస్ అయినా ఈసారి మాత్రం గట్టి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ అప్డేట్ ఎప్పుడు రానుందో చూడాలి.

సంబంధిత సమాచారం :