క్రేజీ బజ్..”విరూపాక్ష” కోసం “వీరమల్లు”.!

Published on Feb 27, 2023 1:00 pm IST

ప్రస్తుతం మెగా హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ లు కలయికలో ఓ కొత్త సినిమా రీసెంట్ గానే స్టార్ట్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా తో పాటుగా ఇద్దరు హీరోలు తమ పాన్ ఇండియా సినిమాలు హరిహర వీరమల్లు మరియు విరూపాక్ష చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే ఈ భారీ సినిమాల్లో ఈ ఏప్రిల్ లో సాయి తేజ్ నటించిన “విరూపాక్ష” రిలీజ్ కి దగ్గర పడుతుండగా మేకర్స్ అయితే సాలిడ్ ప్లానింగ్స్ చేస్తున్నారు.

అందులో భాగంగా అయితే సినిమా టీజర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రిలీజ్ చేయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా మేకర్స్ దీనిపై అధికారిక అనౌన్సమెంట్ ఇవ్వలేదు కానీ ఈ క్రేజీ బజ్ అయితే వైరల్ గా మారింది. ఇక ఈ టీజర్ అయితే ఈ మార్చ్ 1 న రానుంది. అలాగే ఈ సినిమాకి కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర వారు నిర్మాణం వహించారు. అలాగే సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం :