క్రేజీ బజ్ : ‘టిల్లు స్క్వేర్’ లో యంగ్ బ్యూటీ క్యామియో అపియరెన్స్ ?

క్రేజీ బజ్ : ‘టిల్లు స్క్వేర్’ లో యంగ్ బ్యూటీ క్యామియో అపియరెన్స్ ?

Published on Feb 25, 2024 12:06 AM IST


యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా మల్లిక్ రామ్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థల పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అవుతోన్న లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ టిల్లు స్క్వేర్. ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సొంతం చేసుకున్న డీజే టిల్లు కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే టిల్లు స్క్వేర్ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా ఆకట్టుకుని మూవీ పై అంచనాలు మరింతగా పెంచేసాయి. విషయం ఏమిటంటే, ఫస్ట్ పార్ట్ లో రాధిక పాత్రలో నటించిన నేహా శెట్టి ఈ సీక్వెల్ లో కొన్ని నిమిషాల పాటు క్యామియో పాత్రలో కనిపించనున్నారని, ఆ సీన్స్ ఆడియన్స్ ని ఎంతో ఎంటెర్టైన్ చేస్తాయని లేటెస్ట్ టాలీవుడ్ బజ్. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి మార్చి 29న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు