బాలయ్య “అఖండ” నుంచి డైలాగ్ లీక్.. ఫుల్ వైరల్..!

బాలయ్య “అఖండ” నుంచి డైలాగ్ లీక్.. ఫుల్ వైరల్..!

Published on Nov 14, 2021 3:00 AM IST


నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్‌ చిత్రం “అఖండ”. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటిస్తుండగా, తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కాబోతుంది.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చిన్న డైలాగ్ క్లిప్ ఒకటి బయటకొచ్చింది. ‘ముందు లేదు, వెనుక లేదు, కుడి లేదు, ఎడమ లేదు.. అటువైపు నేనే, ఇటువైపు నేనే’ అంటూ సాగే ఈ సినిమాలోని డైలాగ్ లీక్ అయ్యింది. బాలయ్య అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్న ఆ డైలాగ్ క్లిప్ క్షణాల్లో ఫుల్ వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్‌ రేపు సాయంత్రం 7:09 గంటలకు విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు