“క్రేజీ ఫెలో” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం!

Published on Oct 7, 2022 3:38 pm IST

యంగ్ హీరో ఆది సాయికుమార్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆది చేస్తున్న నెక్స్ట్ మూవీ క్రేజీ ఫెలో. సరదాగా సాగే ఈ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 14, 2022 న థియేటర్ల లో విడుదల కానుంది.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేయడం జరిగింది. అందులో భాగంగా అక్టోబర్ 9, 2022 న హైదరాబాద్‌ లోని దస్పల్లా కన్వెన్షన్‌ లో సాయంత్రం 5 గంటల నుంచి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. క్రేజీ ఫెలో లో దిగంగనా సూర్యవంశీ, మీర్నా మీనన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. సప్తగిరి, నర్రా శ్రీనివాస్, అనీష్ కురువిల్లా, వినోదిని వైద్య నాథన్, రవి ప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ధృవన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :