క్రేజీ గాసిప్..”ఆదిపురుష్” ని ఈ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారా?

Published on Jan 9, 2022 5:50 pm IST


పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో చేస్తున్న సినిమా “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా కొన్ని తెలియని అంశాలును తెలియపరిచే చిత్రంగా సరికొత్త రామాయణంలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

నెక్స్ట్ లెవెల్లో విజువల్ ట్రీట్ తో ప్లాన్ చేసిన ఈ సినిమా తాలూకా షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా కూడా అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఓ క్రేజీ గాసిప్ ఇప్పుడు ఈ సినిమాపై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాని ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 20 వేలకు పైగా థియేటర్స్ లోని అలాగే పదికి పైగా భాషల్లో రిలీజ్ చేస్తారని టాక్.

అయితే ఇందులో ఎంతవరకు నిజముందో కానీ సోషల్ మీడియాలో అయితే ఈ టాక్ విన్నాక ప్రభాస్ ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. అయితే దాదాపు ఇందులో ఎలాంటి నిజం లేదని చెప్పాలి. పలు భారతీయ భాషల్లో సహా ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తారని టాక్ మాత్రం ఎప్పుడు నుంచో ఉంది.

సంబంధిత సమాచారం :