క్రేజీ గాసిప్ : “పుష్ప”లో ఐటెం సాంగ్ కి ఊహించని పేరు.?

Published on Nov 14, 2021 6:00 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ సినిమా “పుష్ప ది రైజ్” కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ లో ప్రతీ అంశానికి సంబంధించి చాలా కేర్ గా తీసుకుంటున్న మేకర్స్ ఈ సినిమాల్లో హాట్ ఐటెం సాంగ్ కి గాను ఓ బాలీవుడ్ హాట్ ఐటెం బాంబ్ ని రంగంలోకి దింపుతున్నారని ఎప్పుడు నుంచో బజ్ ఉంది.

కానీ ఇప్పుడు ఊహించని టాక్ ఏమిటంటే ఈ సినిమాకి గాను బాలీవుడ్ నుంచి కాదు టాలీవుడ్ నుంచే స్టార్ట్ హీరోయిన్ ని దింపబోతున్నారని క్రేజీ గాసిప్. ఆమె మరెవరో కాదు స్టార్ హీరోయిన్ సమంతానే.. ఇప్పుడు ఈమె పేరే అనూహ్యంగా రేస్ లోకి వచ్చింది. ఆల్రెడీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే ఐటెం సాంగ్ ని ఇచ్చాడని కూడా టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :