క్రేజీ బజ్..”RRR” కి సీక్వెల్ ఎంతవరకు నిజం..?

Published on Feb 3, 2022 7:03 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా ఆలియా భట్ మరియు ఆంగ్ల నటి ఒలీవియా మోరిస్ లు హీరోయిన్స్ గా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ పీరియాడిక్ విజువల్ వండర్ “రౌద్రం రణం రుధిరం”. టోటల్ పాన్ ఇండియన్ సినిమా దగ్గర భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఊహించని కొత్త డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేసి మరింత హైప్ తీసుకొచ్చారు.

మరి ఇదిలా ఉండగా ఈ భారీ సినిమాపై గత కొన్ని రోజులు నుంచి ఒక ఊహించని గాసిప్ నే వైరల్ అవుతుంది. దీని ప్రకారం ఈ చిత్రానికి సీక్వెల్ ని కూడా సిద్ధం చేస్తున్నారట. అందుకు అవకాశం ఉందనీ.. విజయేంద్ర ప్రసాద్ కూడా రాస్తున్నారని కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ప్రస్తుతానికి అవాస్తవమే అన్నట్టు తెలుస్తుంది. రాజమౌళి ఎప్పుడో ఈ సినిమాని ఒక్క సినిమాగానే తీస్తున్నామని ఎలాంటి సీక్వెల్ ప్లాన్ లేదని తెలిపారు. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న టాక్ మాత్రం ఎంతమేర నిజమవుతుందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :