క్రేజీ : మహేష్ పేరు లోనే తన లాస్ట్ 5 ప్రాజెక్ట్స్.!

Published on Jun 4, 2023 3:55 pm IST

మన టాలీవుడ్ సినిమా దగ్గర అన్ని వర్గాల ఆడియెన్స్ మాస్, క్లాస్ సహా ఫ్యామిలీ ఆడియెన్స్ లో కూడా అపారమైన ఆదరణ ఉన్న స్టార్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకే ఒక్కడు. మరి ఇప్పుడు మహేష్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తో అదిరే మాస్ డ్రామా “గుంటూరు కారం” చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే మహేష్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో భారీ అంచనాలు దీనిపై ఉండగా లేటెస్ట్ గా వచ్చిన ఫస్ట్ టైటిల్ గ్లింప్స్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. మరి మన టాలీవుడ్ హీరోస్ లో మహేష్ ఫిల్మోగ్రఫీ కాస్త యూనిక్ గా ప్రయోగాత్మకంగా ఉంటుంది.

అయితే ఇంట్రెస్టింగ్ గా మహేష్ ఫిల్మోగ్రఫీ లోనే తన పేరు కలిపి రావడం యాదృచ్చికంగా మారింది అని చెప్పాలి. అయితే లాస్ట్ టైం తన వరుస హిట్స్ సమయంలో అనౌన్స్ అయ్యిన “సర్కారు వారి పాట” అనౌన్స్ చేయడంతో కరెక్ట్ గా తన సినిమా టాగ్ తో కలిపి SSMB(Sసూపర్ Sస్టార్ Mమహేష్ Bబాబు) కి పర్ఫెక్ట్ గా సింక్ అయ్యింది.

ఇక ఇపుడు మరింత ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన “గుంటూరు కారం” టైటిల్ లో “G” తో కలిపినట్టు అయితే ఘట్టమనేని సూపర్ స్టార్ మహేష్ బాబు(GSSMB) అంటే వీటిలో ఒకో సినిమా చూస్తే G – గుంటూరు కారం, S – సర్కారు వారి పాట, మరో S – సరిలేరు నీకెవ్వరు, M – మహర్షి, ఇక ఫైనల్ గా B – భరత్ అనే నేను చిత్రాలు ఇలా తన పేరు లోనే తన లాస్ట్ 5 సినిమాలు కూడా రావడం ఎంతో ఇంట్రెస్టింగ్ అంశం అని చెప్పాలి. దీనితో లాస్ట్ టైం సర్కారు వారి పాట టైం లో లానే ఇప్పుడు మరోసారి మహేష్ సినిమాలు ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :