క్రేజీ: “విశ్వంభర” కి ఆ సినిమాకి లింక్?

క్రేజీ: “విశ్వంభర” కి ఆ సినిమాకి లింక్?

Published on Jul 11, 2024 3:00 AM IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా కోసం ఎప్పుడు నుంచి మెగా ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఉండగా ఈ సినిమా షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయితే శరవేగంగా పూర్తయిపోతున్నాయి.

మరి గ్రాఫిక్స్ పరంగా సినిమాకి ఎక్కువ సమయం కావాల్సి ఉండగా ఇప్పుడు ఈ సినిమా సంబంధించి మరో క్రేజీ అంశం వైరల్ గా మారింది. మరి ఈ సినిమాకి మరో ఫాంటసీ చిత్రం “బింబిసార” సినిమాకి లింక్ ఉందా అనే ఇంట్రెస్టింగ్ అంశం వైరల్ గా మారింది. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే దర్శకుడు వశిష్ట తాజాగా సోషల్ మీడియాలో తన కవర్ పిక్ ని అప్డేట్ చేసాడు.

ఇది చూస్తే రెండు సినిమాలకి ఇంటర్ లింక్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. దీనితో టాలీవుడ్ లో మరో క్రేజీ యూనివర్స్ రాబోతోందా అనే డౌట్ ఇప్పుడు అభిమానుల్లో కలుగుతుంది. మరి నిజంగా ఇది సాధ్యపడితే మూవీ లవర్స్ నెక్స్ట్ లెవెల్ ట్రీట్ లభిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు