క్రేజీ.. ఆస్కార్ స్టేజ్ పై “నాటు నాటు” లైవ్ పెర్ఫార్మన్స్.!

Published on Mar 1, 2023 6:58 am IST

గ్లోబల్ స్టార్స్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలయికలో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” చిత్రం వరల్డ్ వైడ్ అందుకున్న సక్సెస్ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మరి ఈ భారీ సినిమాలో సెన్సేషనల్ చార్ట్ బస్టర్ సాంగ్ అయినటువంటి నాటు నాటు పాట వరల్డ్ వైడ్ గా పలు ఇంటర్నేషనల్ సినిమాల పాటలతో ఎంపిక అయ్యింది. అయితే గత కొన్ని రోజులు నుంచి ఎన్టీఆర్ చరణ్ లతో ఆస్కార్ అవార్డ్స్ రోజు ఈ పాట కి లైవ్ పెర్ఫార్మన్స్ ఉంటుంది అని అంతా అనుకుంటూ వచ్చారు.

అయితే దీనిపై స్వయంగా అకాడమీ వారే బిగ్ అనౌన్స్మెంట్ ఇవ్వడం క్రేజీ గా మారింది. కాకపోతే సాంగ్ ఆస్కార్ లో లైవ్ పెర్ఫార్మన్స్ ఉంటుంది కాని దీనిని అయితే సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్ మరియు కాల భైరవ లు అయితే అక్కడ ఆలపించనున్నారు అని అనౌన్స్ చేశారు. దీనితో ఈ ఊహించని అనౌన్స్మెంట్ ఓ రేంజ్ లో ఆసక్తి గా మారింది. మరి ఈ మార్చ్ 12 న జరిగే ఈ ఈవెంట్ లో అయితే చరణ్ మరియు ఎన్టీఆర్ ల లైవ్ పెర్ఫార్మన్స్ కూడా ఇస్తారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :