క్రేజీ : ఎలాంటి గ్లోబల్ సినిమా లేకపోయినా మహేష్ తో మీటప్ లో నెట్ ఫ్లిక్స్ సీఈఓ

Mahesh

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇపుడు “గుంటూరు కారం” అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు లాస్ట్ స్టేజ్ కి వస్తుండగా మహేష్ అయితే ఇప్పుడు పెట్టిన ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఫ్యాన్స్ లో వైరల్ గా మరి సోషల్ మీడియాని అయితే షేక్ చేస్తుంది.

తాజాగా దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ సంస్థ సీఈఓ అయినటువంటి టెడ్ సెరండోస్ మన టాలీవుడ్ స్టార్ హీరోస్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని కూడా కలవడం వైరల్ గా మారింది. మరి వీరిద్దరూ కూడా గత చిత్రం RRR తో గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ సెట్ చేశారు.

కానీ ఎలాంటి పాన్ ఇండియా సినిమా లేదా గ్లోబల్ సినిమా కూడా కూడా లేకపోయినప్పటికీ సూపర్ స్టార్ మహేష్ బాబు ని కూడా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ సీఈఓ మీట్ అవ్వడం అనేది మరింత కేజ్రీగా మారింది అని చెప్పాలి. దీనిపై మహేష్ కూడా తమ మీట్ పై చేసిన పోస్ట్ మరింత ఆసక్తిగా మారింది. మహేష్ ని ఇంటర్నేషనల్ లెవెల్లో చూడాలని ఎప్పటి నుంచో మూవీ లవర్స్ లో ఉన్న మాట. మరి ఇప్పుడు ఇది నిజమయ్యే సూచనలు మరింత బలపడుతున్నాయని వీటితో చెప్పొచ్చు.

Exit mobile version