ఎన్టీఆర్ ‘దేవర’ కోసం సునామీ సీక్వెన్స్

Published on Sep 4, 2023 8:00 am IST

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. అయితే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ సునామీ సీక్వెన్స్ కోసం భారీ స్విమ్మింగ్ ఫూల్ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సునామీ సీక్వెన్స్ లో వీఎఫ్ఎక్స్ విజువల్స్ కూడా అద్భుతంగా ఉంటాయట. సముద్రం నేపథ్యాన్ని, ముఖ్యంగా సముద్రంలోని భయానక వాతావరణాన్ని కూడా ఈ సునామీ సీక్వెన్స్ లో కొరటాల బాగా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు. పైగా ఈ సీక్వెన్స్ కోసం భారీగా ఖర్చు పెట్టబోతున్నారు.

దేవర సినిమాను దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. మరి కథలో కొరటాల శివ ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో చూడాలి. ఇక ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో ఈ సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం :