క్యూట్ లవ్ స్టోరీని ప్లాన్ చేసిన బోయపాటి

Published on May 29, 2023 10:00 am IST

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం హీరో రామ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ థండర్ గ్లింప్స్ ఇప్పటికే రిలీజ్ అయి సినిమా పై అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా ఈ సినిమా పక్కా హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా రాబోతుంది. కానీ ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ పై ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో రామ్ పూర్తిగా రొమాంటిక్ లుక్ లో కనిపిస్తాడు అని, ఈ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ కూడా వెరీ రొమాంటిక్ గా అండ్ ఫుల్ ఫన్ తో సాగుతాయని తెలుస్తోంది.

ఈ సినిమాలో రామ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే క్యూట్ లవ్ స్టోరీని బోయపాటి ప్లాన్ చేశాడట. ఆల్ రెడీ అఖండ సినిమాతో బోయపాటి తన ఖాతాలో భారీ హిట్ ను వేసుకున్నాడు. కాబట్టి.. బోయపాటి చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. అన్నిటికీ మించి హీరో ఎవరైనా తన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ను పక్కాగా ప్లాన్ చేసి హిట్ కొట్టడంలో బోయపాటికి మంచి అనుభవం ఉంది. ఈ మూవీని పాన్ ఇండియన్ రేంజ్ లో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :