క్రేజీ న్యూస్ : ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్ ?

Published on Sep 25, 2023 11:00 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, అందాల నటి శృతి హాసన్ ల తొలి కలయికలో మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మాస్ థ్రిల్లర్ మూవీ సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్. ఈ మూవీ పై ప్రారంభం నాటి నుండి అటు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. నిజానికి సెప్టెంబర్ 28న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రావాల్సిన ఈ మూవీ కొన్ని కారణాల వలన కొన్నాళ్ల పాటు వాయిదా పడింది.

హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న సలార్ లో జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ నెగటివ్ రోల్స్ చేస్తుండగా ఇతర రోల్స్ లో శ్రియా రెడ్డి, ఈశ్వరిరావు, రామచంద్ర రాజు, మధు గురుస్వామి, సప్తగిరి, పృథ్వీరాజ్, ఝాన్సీ, బ్రహ్మాజీ, నాగమహేష్ తదితరులు నటిస్తున్నారు. విషయం ఏమిటంటే, తాజాగా అందుతున్న న్యూస్ ప్రకారం సలార్ మూవీ ని రానున్న డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారట.

ప్రశాంత్ నీల్ భార్య అయిన లిఖితా రెడ్డి, డిసెంబర్ మాములుగా ఉండదు, వెయిట్ చేయలేకపోతున్నాను అంటూ కొద్దిసేపటి క్రితం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో ఒక పోస్ట్ పెట్టారు. అయితే అది సలార్ రిలీజ్ డేట్ కోసమే అని అంటున్నారు. అలానే సలార్ ని పక్కాగా డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నట్లు పలువురు డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా మేకర్స్ వెల్లడించినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సలార్ లేటెస్ట్ రిలీజ్ డేట్ విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే దీని పై మేకర్స్ నుండి మాత్రం పక్కాగా క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :