క్రేజీ: నార్త్ లో హిందీ సినిమాని కొట్టేసి టాప్ లోకి వచ్చిన “కల్కి”

క్రేజీ: నార్త్ లో హిందీ సినిమాని కొట్టేసి టాప్ లోకి వచ్చిన “కల్కి”

Published on Jul 9, 2024 2:01 PM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం వాటిని అందుకొని భారీ వసూళ్ళని అయితే వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర నిలిచింది.

మరి ఇలా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో సహా హిందీ మార్కెట్ లో కూడా అదరగొడుతున్న ఈ చిత్రం ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్ లో అయితే ఈ ఏడాది అక్కడి సినిమానే బీట్ చేసి హిందీలో నెంబర్ 1 సినిమాగా నిలవడం విశేషం. మరి ఈ ఏడాది బాలీవుడ్ లో వచ్చిన చిత్రాల్లో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ అలాగే స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) నటించిన “ఫైటర్” (Fighter) 215 కోట్ల నెట్ వసూళ్లు లైఫ్ టైం లో అందుకుంటే దీనిని ప్రభాస్ కల్కి చిత్రం ఇంకా రెండు వారాలు పూర్తి కాకుండానే ఈ మార్క్ ని 219 కోట్లతో క్రాస్ చేసేసి ఇంకా స్టడీగా దూసుకెళ్తుంది.

మొత్తానికి అయితే ఈ ఏడాదిలో ప్రస్తుతానికి హిందీ మార్కెట్ లో హిందీ సినిమాని కొట్టి నెంబర్ 1 సినిమాగా మన తెలుగు సినిమా కల్కి నిలిచింది అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోణ్ లు ముఖ్య పాత్రల్లో నటించగా కోలీవుడ్ నుంచి లోక నాయకుడు కమల్ హాసన్ విలన్ గా నటించారు. అలాగే సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు