ఈ ఏడాది మన టాలీవుడ్ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ చిత్రాల్లో “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శకుడు రాజమౌళి తీసిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ గుర్తింపుని తెచ్చుకుంది.
ఇక ఇప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో స్పెషల్ షోస్ లు ప్రదర్శితం అవుతున్న ఈ చిత్రానికి తాజాగా లాస్ ఏంజెల్స్ లో చైనీస్ థియేటర్స్ ఐమ్యాక్స్ లో ప్లాన్ చేసిన స్పెషల్ షో కి అదిరే రెస్పాన్స్ ఇప్పుడు వస్తుందట. అక్కడ ఏకంగా సినిమా షో కి 5 గంటల ముందు నుంచే ఇంగ్లీష్ ఆడియెన్స్ పడిగాపులు కాస్తున్నారు.
దీని బట్టి అక్కడ షో కి ఎలాంటి రెస్పాన్స్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి అక్కడ షో కి డైరెక్టర్ రాజమౌళి కూడా హాజరు కాగా అక్కడి మీడియాతో కూడా జక్కన్న ముచ్చటించడం జరిగింది. మొత్తానికి అయితే లాస్ ఏంజెల్స్ RRR షో కి నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వచ్చింది అని చెప్పాలి.
The first people in line for #RRRMovie in @IMAX at the Chinese Theatre got their FIVE HOURS before showtime. Cinema lives in the People's Republic.@JohnnyDPresents @TheEricGoldman pic.twitter.com/hsDkI0tHG1
— Beyond Fest (@BeyondFest) September 30, 2022