NBK109 మూవీ రిలీజ్ పై క్రేజీ రూమ‌ర్

NBK109 మూవీ రిలీజ్ పై క్రేజీ రూమ‌ర్

Published on Jun 20, 2024 3:01 AM IST

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం యంగ్ డైరెక్ట‌ర్ బాబీ ద‌ర్శ‌కత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు NBK109 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు మేక‌ర్స్. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా జరుగుతుండ‌గా, ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించి ఓ టీజ‌ర్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి సినీ వ‌ర్గాల్లో ఓ ఇంట్రెస్టింగ్ రూమ‌ర్ చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఈ మూవీ రిలీజ్ డేట్ ను మ‌రో హీరో న‌టిస్తున్న సినిమా డిసైడ్ చేయ‌నుంద‌ట‌. NBK109 మూవీని క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 20న రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న ‘గేమ్ ఛేంజ‌ర్’ మూవీని కూడా డిసెంబ‌ర్ బ‌రిలోనే రిలీజ్ చేయాల‌ని చూస్తున్నార‌ట‌. ఒక‌వేళ ‘గేమ్ ఛేంజ‌ర్’ క్రిస్మస్ కానుక‌గా వస్తే, NBK109 చిత్రాన్ని సంక్రాంతి బ‌రిలో దించాలని ప్లాన్ చేస్తున్నారు.

దీనికి సంబంధించిన చ‌ర్చ‌లు ప్ర‌స్తుతం న‌డుస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాల రిలీజ్ డేట్స్ పై ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కాగా, NBK109 మూవీలో చాందిని చౌద‌రి, ఊర్వ‌శి రౌటేలా ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. సితార ఎంట‌ర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్లు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు