క్రేజీ : గ్లోబల్ గా “సలార్” సెన్సేషనల్ రీచ్..అది కూడా

క్రేజీ : గ్లోబల్ గా “సలార్” సెన్సేషనల్ రీచ్..అది కూడా

Published on Jan 27, 2024 8:00 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ చిత్రం “సలార్ సీజ్ ఫైర్”. మరి ఈ చిత్రం గత డిసెంబర్ లో వచ్చి భారీ వసూళ్ళని కొల్లగొట్టగా రీసెంట్ గానే ఈ చిత్రం దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది.

అయితే నెట్ ఫ్లిక్స్ లో కూడా భారీ రెస్పాన్స్ ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు క్రేజీ లెవెల్లో గ్లోబల్ డామినేషన్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు సలార్ చిత్రాన్ని చూసి గ్లోబల్ ఆడియెన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. సోషల్ మీడియాలో సలార్ సినిమా కోసం ఓ రేంజ్ లో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రికమెండ్ చేస్తున్నారు. దీనితో సలార్ సెన్సేషన్ నెక్స్ట్ లెవెల్లో స్టార్ట్ అయ్యింది అని చెప్పాలి.

అయితే ఇక్క ఇంకా మరింత ఆశ్చర్యకర విషయం ఏమిటంటే జెనరల్ గా ఇలాంటి రీచ్ అందుకోవాలి అంటే ఎక్కువ శాతం హిందీ వెర్షన్ లోనే సాధ్యం అవుతుంది. కానీ సలార్ కేవలం సౌత్ ఇండియా భాషల్లోనే రిలీజ్ అయ్యి అప్పుడే సెన్సేషనల్ గా మారింది. ఇక హిందీ మరియు ఇంగ్లీష్ లో కానీ స్ట్రీమింగ్ స్టార్ట్ అయితే అప్పుడు ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు