కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “కంగువా” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ భారీ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతుండగా ఈ సినిమా షూట్ పై ఇప్పుడు ఓ క్రేజీ బజ్ వినిపిస్తుంది. దీనితో అయితే ఇప్పుడు మేకర్స్ షూటింగ్ చెన్నై లొనే చేస్తుండగా సూర్య పై ఓ మొసలితో క్రేజీ ఫైట్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఇప్పటికే సినిమా సినిమా గ్లింప్స్ తో సూర్య రోల్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో రివీల్ చేశారు. మరి ఇదే రోల్ లో ఈ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తూ ఉండొచ్చు. ఇక ఈ భారీ చిత్రానికి అయితే దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే యూవీ క్రియేషన్స్ మరియు గ్రీన్ స్టూడియోస్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.