క్రేజీ సీక్వెన్స్ షూట్ లో “కేజీయఫ్ చాప్టర్ 2”.!

Published on Oct 6, 2021 9:00 am IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిస్తున్న భారీ సినిమా “కేజీయఫ్ చాప్టర్ 2”. దీనికి ముందు సినిమా భారీ లెవెల్లో హిట్ కాగా ఈ సీక్వెల్ పై మాత్రం తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎప్పుడో షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు చిన్న ప్యాచ్ వర్క్స్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నట్టు ఉంది. అందులో భాగంగానే ఓ అదిరే సీక్వెన్స్ ని ఇప్పుడు మేకర్స్ చిత్రీకరిస్తున్నారట.

బెంగళూర్ రోడ్ పై ఓ స్టన్నింగ్ కార్ ఛేజింగ్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నట్టుగా ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ తెలిపారు. ఇప్పుడు ఇదే ఇన్స్టాగ్రామ్ స్టోరీ వైరల్ అవుతుంది. మరి ఇదెలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ గా నటించగా ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే రవి బాసృర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబలే పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :