క్రేజీ టాక్ : అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మూవీ లెక్క మారనుందా ?

Published on Sep 26, 2023 1:00 am IST

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఆగష్టు 15న పుష్ప 2 గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.

అయితే దీని తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక భారీ మూవీ చేయనున్నారు అల్లు అర్జున్. ఇటీవల గ్రాండ్ గా అనౌన్స్ మెంట్ వెలువడిన ఈమూవీని గీత ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థలు భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. అల్లు అర్జున్ కెరీర్ 22వ మూవీగా ఇది రూపొందనుంది. అయితే లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ టాక్ ప్రకారం ఇటీవల జవాన్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన అట్లీ, తాజాగా అల్లు అర్జున్ కి ఒక స్టోరీ లైన్ వినిపించారట.

అది ఎంతో నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేస్తే మూవీ చేద్దాం అని చెప్పారట అల్లు అర్జున్. కాగా ఈ పుష్ప 2 తరువాత ఇది అల్లు అర్జున్ కెరీర్ 22వ మూవీగా రూపొందనుండగా దీని అనంతరమే త్రివిక్రమ్ మూవీ తెరకెక్కనుందని టాక్. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ పై క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :