క్రేజీ టాక్.. బాలయ్య షోలో గెస్ట్ గా మెగాస్టార్..?

Published on Jun 24, 2022 2:00 am IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దిగ్గజ హీరోలు మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ లు ఇపుడు తమ భారీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి దీనితో పాటుగా బాలయ్య హోస్ట్ గా ప్రముఖ ఓటిటి సంస్థ “ఆహా” లో “అన్ స్టాప్పబుల్ విత్ ఎన్ బి కె” సాలిడ్ హిట్ షో కూడా చేసిన సంగతి తెలిసిందే.

మరి విజయవంతంగా ఫస్ట్ సీజన్ ను కంప్లీట్ చేసుకున్న బాలయ్య నెక్స్ట్ ఆగష్టు నుంచి రెండో సీజన్ ని స్టార్ట్ చేయనున్నారు. మరి ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ పై ఇప్పుడు క్రేజీ టాక్ అయితే ఒకటి వినిపిస్తుంది. దీని ప్రకారం మరి ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో బాలయ్యతో మెగాస్టార్ చిరు కూర్చోబోతున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో కానీ ఇదే టాక్ గాని నిజం అయితే మెగా అండ్ నందమూరి ఫ్యాన్స్ కి గట్టి ట్రీట్ అనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :