క్రేజీ టాక్ : ‘సలార్’ లో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?

Published on Sep 20, 2023 3:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్. హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ మూవీలో ఈశ్వరి రావు, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి కీలక పాత్రలు చేస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ప్రారంభం నాటి నుండి అందరిలో విపరీతమైన అంచనాలు ఏర్పరిచిన సలార్ టీజర్ ఇటీవల రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంది. ఇక సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ఈ మూవీ కొన్నాళ్ల పాటు వాయిదా పడింది.

అయితే లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ టాక్ ప్రకారం ఈ మూవీ పై కమర్షియల్ గా మరింత హైప్ తీసుకువచ్చేందుకు ఒక స్పెషల్ సాంగ్ ని జత చేయాలని టీమ్ ఆలోచన చేస్తోందట. ఇక ఈ సాంగ్ లో స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన త్రిష లేదా ఐశ్వర్య రాయ్ నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక తాజాగా తన మోకాలి సర్జరీ తరువాత మెల్లగా ప్రభాస్ మెల్లగా కోలుకుంటున్నారని, ఆయన పూర్తిగా కోలుకున్న అనంతరం ఈ సాంగ్ చిత్రీకరణ మొదలెట్టారనున్నారట. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ పై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :