యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా దర్శకుడు మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రం “ఇస్మార్ట్ శంకర్” కోసం తెలిసిందే. మరి ఈ చిత్రంకి క్రేజీ సీక్వెల్ “డబుల్ ఇస్మార్ట్” ఇప్పుడు దానికి మించి భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ అసలు ఈ చిత్రంలోనే క్రేజీ అంశం ఏదన్నా ఉంది అంటే ఒక మనిషికి మెమొరీ ట్రాన్స్ఫర్ చేసే కాన్సెప్ట్ మనిషి మెదడుకి చిప్ పెట్టడం అనేది పూరి జగన్నాథ్ సైడ్ నుంచి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.
అయితే ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ లో రెండు చిప్ లు పెడతారు అన్నట్టుగా క్రేజీ అంశం వినిపిస్తుంది. అంటే ఇస్మార్ట్ శంకర్ రోల్ కే రెండు చిప్ లు ఉంటాయని తెలుస్తుంది. అందుకే డబుల్ ఇస్మార్ట్ అంటూ టైటిల్ పెట్టారని వినిపిస్తుంది. పైగా లేటెస్ట్ గా సోషల్ మీడియాలో గెటప్ శ్రీను ఇచ్చిన హిట్ కూడా వైరల్ గా మారుతుంది. దీనితో డబుల్ ఇస్మార్ట్ లో ఇలాంటి ఒక ఊహించని ట్రీట్ ఉంటుందో లేదో అనేది వేచి చూడాలి.