పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓ బ్రేకింగ్ న్యూస్ !
Published on Sep 1, 2016 3:44 pm IST

pawan-kal
భారీ అంచనాల నడుమ విడుదలై పరాజయం చవిచూసిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం తరువాత పవన్ దర్శకుడు డాలి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై పవన్ అభిమానుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇకపోతే గత రెండురోజులుగా ఈ సినిమాకి ‘కాటమరాయుడు’ అనే క్రేజీ టైటిల్ ను పరిశీలిస్తున్నారని, దాదాపు ఫిక్సయిపోయిందని వార్తలొచ్చాయి. అభిమానులు కూడా ఈ టైటిల్ ను బాగానే రిసీవ్ చేసుకున్నారు.

ఇప్పుడు ఈ వార్తను ధృవీకరిస్తూ చిత్ర నిర్మాత శరత్ మరార్ ‘రేపు పవన్ పుట్టినరోజు సందర్బంగా ఆయన చేస్తున్న సినిమాకు ‘కాటమరాయుడు’ అనే టైటిల్ ను ఫైనల్ చేశాం’ అంటూ ట్విటర్ ద్వారా తెలిపారు. ఈ వార్త తెలిసిన అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ కాబట్టి సినిమాకు ఈ టైటిల్ బాగా సరిపోతుందని, పవన్ అభిరుచికి తగ్గట్టే డిఫరెంట్ గా కూడా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

 
Like us on Facebook