చిరంజీవి 150వ చిత్రానికి టైటిల్ అదేనా ?

chiranjeevi
మెగాస్టార్ ‘చిరంజీవి’ నటిస్తున్న 150వ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ చిత్రం పై వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రానికి ‘ఖైదీ నెం. 150’ అని నామకరణం చేయనున్నారట. ఇది చిరంజీవికి 150వ చిత్రం కావడంత, పైగా చిత్రంలో చిరు ఖైదీ పాత్రలో కనిపిస్తుండటంతో ఈ టైటిల్ ఫికల్స్ చేశారని తెలుస్తోంది. అలాగే ఇదివరకే విడుదలైన వర్కింగ్ స్టిల్స్ లో సైతం ఖైదీ గెటప్ లో ఉన్న చిరంజీవి డ్రెస్ పై 150వ నెంబర్ ఉండటంతో ఇదే ఫైనల్ అని కూడా అంటున్నారు. కానీ ఈ విషయంపై ఇంకా ఎటువంటి అధికారిక సమాచారాం అందలేదు.

గతంలో కూడా ఇదే టైటిల్ తో చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం.786’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ చిత్రం తాలూకు ఫస్ట్ లుక్ టీజర్ ను రేపు సాయంత్రం శిల్పకళా వేదికలో చిరు పుట్టినరోజు సందర్బంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ వేడుకలో అసలు టైటిల్ ఏమిటనేది తెలిసే అవకాశముంది. ‘వివి వినాయక్’ దర్శకత్వంలో ‘రామ్ చరణ్’ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2017 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.