చిరు “లూసిఫర్” రీమేక్‌పై క్రేజీ అప్డేట్..!

Published on Aug 20, 2021 2:00 am IST

మెగస్టార్ చిరంజీవి హీరోగా, మోహన్ రాజా దర్శకత్వంలో మళయాళంలో సూపర్ హిట్టైన “లూసిఫర్” సినిమా తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్‌, ఎన్‌వీఆర్‌ సినిమా సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేసుకున్న చిరు ‘లూసిఫర్‌’ షూటింగ్‌ను మొదలుపెట్టాడు. ఈ నేపధ్యంలో ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.

ఈ సినిమాలో మెగాస్టార్‌ సోదరిగా నయనతార నటిస్తుండగా, ఒరిజినల్‌ వెర్షన్‌లో వివేక్ ఒబెరాయ్‌ పోషించిన పాత్రను సత్యదేవ్ పోశిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో సత్యదేవ్‌కు భార్యగా నయనతార కనిపించనుందని, ఈ పాత్రకు నయనతార కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ రీమేక్‌లో భారీ తారాగణమే ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఇందులో సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :