లేటెస్ట్..రికార్డు నెంబర్ భాషల్లో “అవతార్ 2” రిలీజ్.!

Published on Apr 27, 2022 8:00 am IST

ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర చెరగని రీతి బాక్సాఫీస్ వసూళ్ళని నెలకొల్పిన ఏకైక హాలీవుడ్ సినిమా “అవతార్”. హాలీవుడ్ జేమ్స్ కేమరూన్ తెరకెక్కించిన ఈ సినిమా 2009 లో రిలీజ్ అయ్యి అప్పటి టికెట్ ధరలు థియేటర్స్ తోనే ఇప్పటికీ క్రాస్ చెయ్యలేని భారీ స్థాయి వసూళ్ళని కొల్లగొట్టింది. ఇక దీని తర్వాత మళ్ళీ దర్శకుడు సీక్వెల్స్ అనౌన్స్ చెయ్యడంతో వీటిపై భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి.

మరి వాటిలో మొదటగా “అవతార్ పార్ట్ 2” ని ఈ ఏడాదిలో రిలీజ్ చెయ్యడానికి ఫిక్స్ చెయ్యగా ఇప్పుడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని భాషల్లో ఒకే రోజు విడుదల కానుందో తెలుస్తుంది. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 16న ఏకంగా 160 భాషల్లో విడుదల కాబోతుంది అట. ఇది ఒక సాలిడ్ రికార్డు నెంబర్ అని చెప్పాలి.

అలాగే ఈరోజు ఈ చిత్రం తాలూకా గ్లింప్స్ ని మేకర్స్ సినిమా కాన్ లో ప్రీమియర్ ప్రదర్శితం చేస్తారని తెలుస్తుంది. అలాగే హాలీవుడ్ సినిమా “డాక్టర్ స్ట్రేంజ్ మ్యాడ్ నెస్ ఆఫ్ మల్టీ వర్స్” తో థియేటర్స్ లో కూడా రిలీజ్ చేస్తారని ఇది వరకు వార్తలు ఉన్నాయి. మొత్తానికి అయితే ఆడియెన్స్ మాత్రం ఈ క్రేజీ టీజర్ ని చూసేందుకు అత్యంత ఆసక్తికరంగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :