‘వీర సింహారెడ్డి’లో బాలయ్య పాత్ర అదే ?

‘వీర సింహారెడ్డి’లో బాలయ్య పాత్ర అదే ?

Published on Dec 4, 2022 7:46 PM IST

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘వీర సింహారెడ్డి’. ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్ పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ లో బాలయ్య పాత్ర నెగిటివ్ యాంగిల్ లో ఉంటుందని.. అయితే, సెకండ్ హాఫ్ లో నెగిటివ్ నుంచి పాజిటివ్ గా టర్న్ తీసుకుంటుందని తెలుస్తోంది.

కాగా థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని.. ‘క్రాక్’ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ కొట్టి యాక్షన్ డైరెక్టర్ గా గోపీచంద్ మలినేని స్టార్ డమ్ సాధించాడు. మరి ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్న వీర సింహా రెడ్డి తో.. ఇక గోపిచంద్ ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి. ఈ సినిమా పై అయితే మంచి అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు