‘వీరమల్లు’ షెడ్యూల్ పరిస్థితేంటి ?

Published on Sep 11, 2023 12:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా నుంచి పవన్ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ విడుదలై బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ మూడో వారం నుంచి పవన్ ఈ సినిమాకి డేట్స్ కేటాయించాడని టాక్ నడిచింది. ఐతే, ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలను బట్టి.. పవన్ ‘హరిహర వీరమల్లు’ షెడ్యూల్ ను మళ్లీ పోస్ట్ ఫోన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురానున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా పవన్ నటిస్తోన్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది.

సంబంధిత సమాచారం :