‘హరిహర వీరమల్లు’లో మెయిన్ హైలైట్ అదే !

‘హరిహర వీరమల్లు’లో మెయిన్ హైలైట్ అదే !

Published on Nov 15, 2022 1:06 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘హరిహర వీరమల్లు’. అయితే, ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా ఇంటర్వెల్ లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కి సంబంధించి ఓ ట్విస్ట్ రివీల్ అవుతుందట. ఈ ట్విస్ట్ సినిమాలోనే మెయిన్ హైలైట్ గా నిలుస్తోందట.

పైగా ఈ సినిమాలో పవన్ పాత్ర పవన్ ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని తెలుస్తోంది. కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురానున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు