‘లోకి సినిమాటిక్ యూనివర్స్’ పై కన్ఫామైన క్రేజీ అప్డేట్.!

‘లోకి సినిమాటిక్ యూనివర్స్’ పై కన్ఫామైన క్రేజీ అప్డేట్.!

Published on Nov 20, 2022 12:00 PM IST

ప్రస్తుతం మన సౌత్ ఇండియా సినిమా దగ్గర ఆడియెన్స్ ని బాగా థ్రిల్ చేసిన టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్. తన “విక్రమ్” చిత్రంతో “ఖైదీ” సినిమాని కూడా కలిపి అదిరిపోయే యూనివర్స్ ని క్రియేట్ చేసి లోకేష్ కనగ్ రాజ్ నుంచి ఇక మీద రాబోయే అన్ని సినిమాలు కూడా ఈ తరహాలోనే ఉంటాయి అని వచ్చిన టాక్ చాలా క్రేజీగా మారింది. దీనితో ఇప్పుడు హీరో విజయ్ తో చేయబోయే “దళపతి 67” కోసం అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇపుడు ఈ సినిమాపై కూడా అదిరే క్లారిటీ బయటకి వచ్చేసింది. లేటెస్ట్ గా కోలీవుడ్ వర్గాలతో నటుడు నరైన్ మాట్లాడుతూ లోకేష్ ఇపుడు చేస్తున్న విజయ్ సినిమా కూడా లోకి సినిమాటిక్ యూనివర్స్ లో భాగమే అని అయితే తాను ఈ చిత్రంలో ఉండను కానీ ఖైదీ 2 చిత్రంలో మళ్ళీ కనిపిస్తానని తాను చెప్పాడు. దీనితో ఈ సాలిడ్ అప్డేట్ సౌత్ ఇండియా సినిమా దగ్గర మంచి కేజ్రీగా మారిపోయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు