‘గుంటూరు కారం’లో మూడో హీరోయిన్ ?

Published on Sep 19, 2023 8:01 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో ఇప్పటికే శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కానీ తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఇప్పుడు ‘గుంటూరు కారం’లో మూడో హీరోయిన్ కూడా ఉంటుందట. కేవలం రెండు సీన్లకు మాత్రమే పరిమితం అయ్యే ఆ పాత్రలో కాజల్ అగర్వాల్ అయితే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నారు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. అయితే, గుంటూరు కారం చిత్రంలో ఈ మూడో హీరోయిన్ పాత్ర సెకండ్ హాఫ్ లో వస్తోందట.

కాగా గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తోంది. ముఖ్యంగా మహేష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో త్రివిక్రమ్ ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట. పైగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా మ‌హేష్ కెరీర్లో 28వ సినిమాగా తెర‌కెక్కుతుంది. జ‌న‌వ‌రి 13, 2024న రిలీజ్ ఈ సినిమా కానుంది.

సంబంధిత సమాచారం :