ఎన్టీఆర్ రెండో క్యారెక్టర్ పై క్రేజీ ట్విస్ట్ ?

ఎన్టీఆర్ రెండో క్యారెక్టర్ పై క్రేజీ ట్విస్ట్ ?

Published on May 1, 2023 7:02 AM IST

ఎన్టీఆర్ తన తాజా చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. అయితే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ కి సంబంధించి ఓ క్రేజీ ట్విస్ట్ ఉంటుందని.. ఇంటర్వెల్ లో రివీల్ అయ్యే ఈ ట్విస్ట్ కథను మలుపు తిప్పుతుందని.. పైగా సెకండ్ హాఫ్ డ్రైవ్ మొత్తం ఈ ట్విస్ట్ చుట్టే తిరుగుతుంది అని.. ఈ ట్విస్ట్ ఎన్టీఆర్ రెండో క్యారెక్టర్ కి సంబంధించే అని టాక్ నడుస్తోంది.

ఎంతైనా కొరటాల ఈ కథ కోసం చాలా నెలలు కసరత్తులు చేశాడు. మరి కథలో ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో చూడాలి. ఇక ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో ఈ సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. పైగా ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు