‘ఎన్టీఆర్ 30’లో మరో క్రేజీ క్యారెక్టర్ ?

Published on May 22, 2023 5:22 pm IST

ఎన్టీఆర్ తన తాజా చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. అయితే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండో క్యారెక్టర్ కూడా ఉంటుందని.. ఇంటర్వెల్ లో రివీల్ అయ్యే ఈ రెండో క్యారెక్టర్ కథను మలుపు తిప్పుతుందని.. పైగా సెకండ్ హాఫ్ డ్రైవ్ మొత్తం ఎన్టీఆర్ రెండో క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది అని తెలుస్తోంది. ఎన్టీఆర్ లాంటి నటుడు పై రెండో క్యారెక్టర్ అంటే.. అది కథలో ఎంతో కీలకం అయ్యి ఉంటుంది. ఎంతైనా కొరటాల ఈ కథ కోసం చాలా నెలలు కసరత్తులు చేశాడు.

మరి కథలో కొరటాల శివ ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో చూడాలి. ఇక ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో ఈ సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం :