ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

Published on May 8, 2023 12:00 pm IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా గురించి మరో అప్ డేట్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పైగా ఈ ఫస్ట్ లుక్ వీడియో మోషన్ పోస్టర్ తో పాటు వాయిస్ ఓవర్ కూడా హైలైట్ గా ఉంటుందట. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజమేందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందట. సినిమాలో కథ జరిగే నేపథ్యం కొత్తది కావడంతో ఆ నేపథ్యానికి తగ్గట్టే ఎన్టీఆర్ పాత్రను కూడా చాలా పవర్ ఫుల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం లెంగ్తీ షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. కాబట్టి.. ఈ సినిమా షూట్ వేగంగా జరగనుంది. ఈ మూవీ ద్వారా తెలుగు చిత్ర సీమలోకి జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా అవకాశం రాగానే తన ఆనందానికి అవధులు లేవని, తన సంతోషాన్ని మాటల్లో వర్ణించలేకున్నాను అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ సినిమా కోసం కొరటాల కూడా బాగా కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం :