క్రేజీ అప్డేట్ : బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో పవన్ సినిమా ఫిక్స్.!

Published on Nov 24, 2021 11:59 am IST


ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా “భీమ్లా నాయక్” మరియు “హరిహర వీరమల్లు” అనే రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే పవన్ తన కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా మరిన్ని సినిమాలు లైన్ లో పెట్టేసి ఆశ్చర్యపరిచారు. అయితే ఇప్పుడు పవన్ లైనప్ పై మరో క్రేజీ అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది.

టాలీవుడ్ లో వరుస భారీ హిట్స్ తో దూసుకెళ్తున్న మరో దర్శకుడు అనీల్ రావిపూడి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల కాంబోలో సినిమా ఒకటి ఉందట. దీనిని అనీల్ నే స్వయంగా లేటెస్ట్ ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు. దీనితో ఈ సెన్సేషనల్ కాంబో కార్డ్స్ మీదకి వచ్చినట్టు అయ్యింది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది అనే ఇతర అంశాలు కాలమే నిర్ణయించాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More