‘పుష్ప 2’లో మరో కొత్త క్యారెక్టర్.. ‘పుష్ప 3’కి లీడ్ అట !

‘పుష్ప 2’లో మరో కొత్త క్యారెక్టర్.. ‘పుష్ప 3’కి లీడ్ అట !

Published on Oct 25, 2022 11:19 PM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న చిత్రం ‘పుష్ప 2’. కాగా తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా సెకెండ్ హాఫ్ లో వచ్చే ఓ కొత్త క్యారెక్టర్ ద్వారా.. ఈ సినిమా క్లైమాక్స్ లో ఓ భారీ ట్విస్ట్ రివీల్ అవుతుందట. ఈ ట్విస్ట్ ‘ పుష్ప 3’ కి లీడ్ అవుతుందని తెలుస్తోంది. మరీ ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో తెలియదు గానీ, ఈ వార్త మాత్రం బన్నీ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ను ఇస్తోంది.

ఇక ‘పుష్ప ద రూల్’ వర్క్ ప్రస్తుతం ఫుల్ ఫ్లో లో ఉంది. ఏది ఏమైనా ‘పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది. పుష్పరాజ్ లాంటి పాత్రను ఓ స్టార్ హీరో చేసి మెప్పించడం చాలా రిస్క్. బన్నీ ఆ రిస్క్ ను బాగా హ్యాండిల్ చేశాడు. అందుకే, పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. పైగా పుష్ప 2 కి ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు పుష్ప 3 పై కూడా రూమర్ వైరల్ అవుతుంది. మరీ పుష్ప 3 ఉంటుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు