రవితేజ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా “టైగర్ నాగేశ్వరరావు” ఫస్ట్ లుక్.!

Published on May 12, 2023 9:00 am IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు మహేష్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ “టైగర్ నాగేశ్వరరావు” కూడా ఒకటి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా భారీ స్కేల్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గానే టీజర్ మరియు ఫస్ట్ లుక్ విషయంలో ఇంట్రెస్టింగ్ బజ్ బయటకి వచ్చింది. అయితే ఇప్పుడు మేకర్స్ సినిమా ఫస్ట్ లుక్ విషయంలో సాలిడ్ హింట్స్ ఫ్యాన్స్ కి అందిస్తున్నారు.

మరి ఈ ఫస్ట్ లుక్ పై అయితే మేకర్స్ రవితేజ ఫ్యాన్స్ కి హైప్ ఎక్కిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ అంతా ఎంతో హ్=గర్వించే లెవెల్లో ఉంటుంది అని అలాగే ఈ ఫస్ట్ లుక్ తో అయితే మాస్ మహారాజ్ మాస్ సంభవం అంటూ అతి త్వరలోనే ఈ లుక్ ని రిలీజ్ చేస్తామని సాలిడ్ అనౌన్సమెంట్ అయితే అందించారు. దీనితో ఈ ఫస్ట్ లుక్ విషయంలో ఇపుడు మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయని చెప్పాలి.

సంబంధిత సమాచారం :