క్రేజీ..”RRR” కి సీక్వెల్ రాబోతోందా..?

Published on Apr 2, 2022 7:00 pm IST


లేటెస్ట్ గా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ గా నిలిచిన చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ ఎన్టీఆర్ అభిమానులు వేచి చూసిన ఎన్నో ఏళ్ల నిరీక్షణకు మళ్ళీ ప్రపంచం అంతా తెలుగు సినిమా వైపు చూసే విధంగా దర్శకుడు రాజమౌళి తిరుగు లేని సమాధానాన్ని అందించాడు.

భారీ వసూళ్లు తో దూసుకెళ్తున్న ఈ సినిమా ఇప్పుడు రెండో వారం లోకి ఎంటర్ అయ్యింది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ కి ముందే దర్శకుడు రాజమౌళికి ఈ సినిమాని కూడా బాహుబలి లానే రెండు భాగాలుగా తీస్తారా అనే దానిపై ప్రశ్నలు ఎదురు కాగా రాజమౌళి కేవలం ఇది ఒక సినిమా మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు.

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మాత్రం ఈ భారీ సినిమాకి సీక్వెల్ ఉండొచ్చు అని ఈ సినిమా ప్రాణదాత అయినటువంటి రచయిత విజయేంద్ర ప్రసాద్ లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ ల్లో మాట్లాడ్డం అందరిలో క్రేజీగా మారింది. సినిమా అందరికీ నచ్చింది. ప్రస్తుతానికి కొన్ని ఐడియా లు కూడా ఉన్నాయని వాటితో అన్నీ కుదిరితే సీక్వెల్ ఉండొచ్చని తెలిపారు. దీనితో RRR 2 ఉండడం ప్రస్తుతానికి నిజం అనుకోవచ్చు.

సంబంధిత సమాచారం :