‘చరణ్ – సుకుమార్’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకుడిగా కొత్త సినిమా ఎనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. జోడు గుర్రాల పోస్టర్ తో రోరింగ్ టూ కాంకర్ అనే ట్యాగ్ లైన్ తో మేకర్స్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. అప్పటి నుంచి చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా గురించి ఏదొక రూమర్ వినిపిస్తూనే ఉంది. తాజాగా మరో కొత్త రూమర్ వైరల్ అవుతుంది.

కాగా నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మరికొద్ది రోజుల్లో టీమ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు ఈ సినిమాలో చరణ్ సరసన దీపికా పడుకోణె నటించబోతుంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రామ్ చరణ్ కెరీర్ 17వ మూవీ గా రూపొందనున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

Exit mobile version