క్రేజీ అప్డేట్ : “బిగ్ బాస్” తెలుగు సరికొత్త వెర్షన్..ఇంట్రెస్టింగ్ వివరాలు ఇవే.!

Published on Dec 24, 2021 12:00 pm IST

ఒక్క మన తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గరే కాకుండా టోటల్ ఇండియన్ టెలివిజన్ దగ్గరే సూపర్ హిట్ గా నిలిచిన గ్రాండ్ రియాలిటీ షో “బిగ్ బాస్”. అలాగే తెలుగులో షోనే ఇప్పటి వరకు ఇండియాలో టాప్ మోస్ట్ రేటింగ్ తో దూసుకెళ్లింది. ఇక ఈ ఏడాది సీజన్ 5 ని కూడా ముగించుకున్న ఈ షో అప్పుడే దాని సక్సెసర్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సీజన్ కాకుండా సరికొత్త బిగ్ బాస్ తెలుగు వెర్షన్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ట్ వారు అనౌన్స్ చేసారు. మరి ఈ కొత్త వెర్షన్ టీవిలో ప్రసారం అయ్యేది కాదట ఓటిటి వెర్షన్ కి ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. మరి అంతే కాకుండా ఇది టీవిలో లా కాకుండా మొత్తం 24 గంటలు ప్రసారం అవుతుందని ఇంకో ఇంట్రెస్టింగ్ సమాచారం తెలిపారు.

అలాగే ఈ ఓటిటి వెర్షన్ కి కూడా కింగ్ నాగార్జున నే హోస్టింగ్ చేయబోతున్నట్టు ఇంకో క్రేజీ అప్డేట్ ని ఇచ్చారు. ప్రస్తుతం అయితే ఇంకా ఈ వెర్షన్ ని డెవలప్ చేసే పనిలో ఉన్నామని నాగ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది ఎలా ఉంటుంది అనేవి తర్వాత ఒక్కొక్కటిగా రివీల్ చేస్తామని కన్ఫర్మ్ చేశారు. ఇక బిగ్ బాస్ వీక్షకులకి ఇంకో అదిరే ట్రీట్ రెడీ అవుతున్నట్టే అని చెప్పాలి. తెలుగులో ఈ కొత్త ప్రయత్నం ఎలా ఉంటుందో కూడా చూడాలి.

సంబంధిత సమాచారం :