క్రేజీ..”సలార్” టీజర్..సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ పై ఊహించని టాక్.!

Published on Jun 19, 2022 11:00 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. మరి ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుగుతుంది.

అయితే ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు ఎప్పుడు నుంచో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ టీజర్ మరియు ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ పై ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి వినిపిస్తుంది. మొదటగా టీజర్ పై అయితే ఇందులో ముఖ్యంగా ప్రభాస్ లుక్స్ చాలా పవర్ ఫుల్ గా హైలైట్ గా కనిపిస్తాయట.

అలాగే సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కి మాత్రం నీల్ ప్రేక్షకులు ఎవరూ ఊహించని కొత్త కొత్త ఎపిసోడ్స్ ని చూపించబోతున్నాడని తెలుస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ తో చేయించే పలు యాక్షన్ సీక్వెన్స్ లను ఇండియన్ సినిమా దగ్గర చూడని కొత్త పరికరాలు వెహికిల్స్ తో ఈ సినిమాలో డిజైన్ చేస్తున్నారట. ఇవి మాత్రం మాసివ్ ట్రీట్ ని అందిస్తాయని తెలుస్తుంది. మరి చూడాలి నీల్ అయితే ప్రభాస్ లాంటి యాక్షన్ కటౌట్ ని ఎలా ప్రెజెంట్ చేస్తాడో అనేది.

సంబంధిత సమాచారం :