పుష్పరాజ్ గెటప్ లో క్రికెటర్ జడేజా

Published on Jan 12, 2022 10:02 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప ది రైజ్. ఊహించని రీతిలో ఈ చిత్రం ఘన విజయం సాధించడం జరిగింది. పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం పై పలువురు ప్రముఖులు, సినీ పరిశ్రమ కి చెందిన వారు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీమ్ ఇండియా క్రికెటర్లు సైతం పుష్పరాజ్ కి ఫిదా అయిపోయారు.

తాజాగా సోషల్ మీడియా వేదిక గా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఒక పోస్ట్ చేయడం జరిగింది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైరు అంటూ పవర్ ఫుల్ డైలాగ్ ను చెప్పుకొచ్చారు. జడేజా పుష్పరాజ్ గెటప్ లో ఉన్న ఫోటో ను అభిమానులతో షేర్ చేశారు. ఈ ఫోటో కాస్త ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :