‘మృత్యుంజయ్’ కోసం క్రిస్పీ రన్‌టైమ్.. శ్రీవిష్ణు మార్క్ ట్రీట్మెంట్ ఖాయం..!

Mrithyunjay

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. సుకుమార్ శిష్యుడు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, మార్చి 6న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచగా, తాజాగా ఈ సినిమా రన్ టైమ్ గురించిన ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.

ఈ చిత్ర బృందం సినిమా నిడివిని చాలా క్రిస్పీగా లాక్ చేసినట్లు తెలుస్తోంది. కేవలం 1 గంట 58 నిమిషాల రన్ టైమ్‌తో ఈ సినిమా రాబోతోందని తెలుస్తోంది. సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు తక్కువ నిడివి ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. కథనం వేగంగా సాగితే ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఉత్కంఠను కలిగిస్తుందని, ఈ రన్ టైమ్ సినిమా విజయానికి దోహదపడుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన పలువురు దర్శకులు ఈ సినిమాను చూసి సానుకూల స్పందన వ్యక్తం చేశారు. తనదైన కామెడీ మార్క్ నుంచి బయటకు వచ్చి శ్రీ విష్ణు చేస్తున్న ఈ విభిన్న ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటుందని సమాచారం. రెబా మోనికా జాన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించాడు.

Exit mobile version