బాలీవుడ్ హిట్ మూవీ తెలుగులో రీమేక్?

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సక్సెస్ సినిమాలని తెలుగులో, తెలుగులో సక్సెస్ అయిన సినిమాలని బాలీవుడ్ లో రీమేక్ చేసే ట్రెండ్ భాగా నడుస్తుంది. అందులో భాగంగానే తాజాగా బాలీవుడ్ లో ఇర్ఫాన్ ఖాన్ కీలక పాత్రలో హిందీ మీడియం అనే సినిమా వచ్చింది. ఆ సినిమా కమర్షియల్ గా మంచి హిట్ అందుకొని బాలీవుడ్ ప్రేక్షకులని ఆకట్టుకుంది.

అయితే ఇప్పుడు ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనతో దర్శకురాలు నందిని రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాని తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ చేస్తే మంచి సక్సెస్ అవుతుందని, అలాగే నేటివిటీకి కూడా భాగా కనెక్ట్ అవుతుందని ఆలోచనతో ఆమె ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి టైటిల్ గా తెలుగు మీడియం అని పెట్టే ఆలోచన కూడా ఉందని వార్త హల్చల్ చేస్తుంది. వెంకటేష్ కూడా రీమేక్ ల మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నందున ఇది సెట్స్ మీదకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.