క్రేజీ న్యూస్ : క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డుల నామినేషన్స్ లో ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు

Published on Feb 23, 2023 3:02 am IST

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన అత్యద్భుత దృశ్య కావ్యం ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ కొమురం భీం గా అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా తమ అద్భుత నటనతో ఆడియన్స్ ని మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య దీనిని భారీ వ్యయంతో రూపొందించారు. రిలీజ్ అనంతరం వందల కోట్ల కలెక్షన్ తో పాటు గ్లోబల్ గా కోట్లాదిమంది ప్రేక్షకాభిమానుల ప్రేమని చూరగొన్న ఆర్ఆర్ఆర్ మూవీని ఇటీవల పలు అంతర్జాతీయ అవార్డులని సైతం కైవశం చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే విషయంలోకి వెళితే, లేటెస్ట్ గా అంతర్జాతీయంగా పేరుగాంచిన క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డుల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కూడా బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ క్యాటగిరి నామినేషన్స్ లో నిలిచారు. కాగా హాలీవుడ్ దిగ్గజ నటులైన టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్, నికోలస్ కేజ్ వంటి వారితో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా కాంపిటీషన్ లో నిలవడం నిజంగా ఎంతో గొప్ప విశేషం అనే చెప్పాలి. కాగా ఈ అవార్డుల యొక్క ఫలితాలు మార్చి 16న వెల్లడిస్తారు. మొత్తంగా ఈ న్యూస్ అటు మెగా, ఇటు నందమూరి అభిమానులు ఇద్దరినీ కూడా ఉబ్బితబ్బిబ్బు చేసే న్యూస్ అనే చెప్పాలి. మరి ఆ అవార్డు ఫైనల్ గా ఎవరిని వరిస్తుందో తెలియాలి అంటే మరికొద్దిరోజుల వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం :