
మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంట్ తీగ’ సినిమా కమర్షియల్ గా బాక్స్ ఆఫీసు వద్ద విజయాన్ని అందుకుంది. టాలీవుడ్ గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో హాట్ బ్యూటీ సన్నీ లియోన్ ఓ ముఖ్య పాత్ర పోషించింది. ఈ సినిమా అక్టోబర్ 30న రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా మంచు మనోజ్ కెరీర్ లో రికార్డ్ కలెక్షన్స్ ని సాధించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్దే కాకుండా శాటిలైట్ పరంగా కూడా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధించింది.
తాజా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జెమిని టీవీ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. మాకు అందిన సమాచారం ప్రకారం సుమారు 4 కోట్లకి జెమిని వారు కరెంట్ తీగ శాటిలైట్ రైట్స్ ని తీసుకున్నారు. కమర్షియల్ గా మంచి హిట్ అవ్వడంతో ఈ సినిమాకి ఇంత రేటు పలికిందని అంటున్నారు. కామెడీ ఎంటర్టైనర్స్ డైరెక్టర్ జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాని మంచి విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించాడు.